గ్యారెంటీలను అమలు చేయాలి
25-11-2025 12:00 AM
నిర్మల్, నవంబర్ 24 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల ను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎం ఎల్ న్యూ మాస్ పార్టీ జిల్లా నేతలు నంది రామయ్య రాజన్న డిమాండ్ చేశారు.
ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సోమవారం ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెన్షన్లను పెంచాలని 500 కి గ్యాస్ సిలిండర్ అందించాలని రైతుబంధును అందరికీ అమలు చేయాలని పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు






