calender_icon.png 20 January, 2026 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను స్కూల్ కు పంపించేది నిర్మాణ పనుల కోసమేనా..?

20-01-2026 12:22:37 PM

- మైనర్ విద్యార్థులతో భవన నిర్మాణ పనులు..

- ప్రజ్ఞ స్కూల్ యాజమాన్యం తీరు

- సోషల్ మీడియాలో వైరల్ 

- యజమాన్యoపై చర్యలకి డిమాండ్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో ఓ ప్రైవేట్ పాఠశాల యజమాన్యం చిన్నారులతో భవన నిర్మాణ పనులు చేపిస్తున్న సంఘటన చర్చనీయాంశంగా మారింది. యజమాన్యం ఇష్ట రాజ్యాన్ని ఈ ఈ సంఘటన బయటపెట్టింది. విద్యాబుద్ధులు నేర్పిస్తారని తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపిస్తే ఆ యజమాన్యం భవన నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్నారు. బరువైన పనులు చేపిస్తూ విద్యార్థుల జీవితాలతో స్కూలు యజమాన్యం చెరగటమాడుతుంది.

ఇది ఎక్కడో కాదు కన్నెపల్లి మండలంలో ప్రజ్ఞ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులతోటి భవన నిర్మాణ కూలి పనులు చేపిస్తున్న సంఘటన వెలుగు చూసింది. ముక్కు పచ్చలారని విద్యార్థులతో వెట్టి  పనులు చేయిస్తున్న  స్కూల్ యజమాన్యం కసాయి తనం  విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది. విద్యార్థులతో బరువైన పనులను చేపిస్తున్నారు. నెత్తిన బరువెత్తుకొని మెట్లెక్కి పనులను విద్యార్థులు చేస్తున్నారు. బరువులు ఎత్తుకొని మెట్ల ఎక్కి కింద పడితే ఇక వారి ప్రాణాలు గాలిలో కలుసుడే. విద్యార్థులతో ప్రాణాంతకమైన నిర్మాణ బరువు పనులను చేపిస్తున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విద్యాబుద్ధులు చెప్పించాల్సిన పాఠశాల లో విద్యార్థులు కూలీలుగా మార్చి వేశారు. కన్నెపల్లి మండల విద్యాధికారి కార్యాలయానికి, ఎం ఈ వో  పని చేసే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కూత వేటు దూరంలో ఉన్న ప్రజ్ఞ మోడల్ స్కూల్ లో విద్యార్థులతో భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. విద్యార్థులతో ఇసుక భవనం పైకి మోపించడం  వారికి మనసేలా వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. ప్రజ్ఞ పాఠశాల యజమాని సోదరుడైన ప్రిన్సిపల్ పర్యవేక్షణలో ఉపాధ్యాయుల కనుసన్న ల్లో  విద్యార్థులతో భవన నిర్మాణ పనులు చూపిస్తున్నారు.

ఈ ఘటనను గమనించిన గ్రామస్తులు వీడియోలు చిత్రీకరించి  సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ ఈ సంఘటన వెలుగు చూసింది. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు చదువుకు బదులు వారితో వెట్టిచాకిరి చేయించడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తలెత్తుతున్నాయి. పాఠశాల యజమాన్యం తీరు విద్యార్థుల తల్లిదండ్రులను కలిచి వేసింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పనులు చేయించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 ప్రజ్ఞ మోడల్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి డిమాండ్

పాఠశాల కు చదువు కునేందుకు వచ్చే విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పించాల్సిన ప్రజ్ఞ మోడల్ స్కూల్  యాజమాన్యం వారిచే భవన నిర్మాణ పనులు చేయించడం సరైనది కాదని  పీ డీ ఎస్ యూ జిల్లా కార్యదర్శి రెడ్డి చరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులచే పనులు చేయించిన యజమాన్యంపై కేసు నమోదు చేయాలని బాల కార్మిక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.