20-01-2026 02:14:06 AM
గజ్వేల్ డీఈఈ, ఎడిఈ కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు, సిబ్బంది
గజ్వేల్, జనవరి 19: సంక్రాంతి సెలవులు పూర్తయినా గజ్వేల్ విద్యుత్ శాఖ అధికారులు అదే మత్తులో ఉండిపోయారు. గజ్వేల్ ఎడి కార్యాలయంలోనే ప్రస్తుతం డీఈ కార్యాలయం కూడా కొనసాగుతుంది. కార్యాలయంలో విధులకు హాజరు కావలసిన అధికారులు, సిబ్బంది ఉదయం 10.30 కావస్తున్నా హాజరు కాకపోగా, ముగ్గురు సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. కార్యాలయంలో తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినియోగదారులు అధికారులు సిబ్బంది లేకపోవడంతో వెనుదిరిగిపోవడం కనిపించింది. విధి నిర్వహణలో విద్యుత్ శాఖ అధికారుల తీరుకు వారి సమయపాలనే అద్దం పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సరైన చర్యలు చేపట్టి సమయపాలన పాటించేలా అధికారులు సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.