calender_icon.png 20 January, 2026 | 1:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలకు చెక్‌ : ఎంవీఐ మోహన్

20-01-2026 12:25:08 PM

వాంకిడి,(విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని ఆటో స్టాండ్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ మోహన్ ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై పలు సూచనలు చేస్తూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే డ్రైవర్లతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

ఎంవీఐ మోహన్ మాట్లాడుతూ.... ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, జాతీయ రహదారులపై ఆటోల ప్రయాణానికి విధించిన నిషేధాన్ని గుర్తుంచుకొని వాహనాలు నడపాలని తెలిపారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని, సరైన కండిషన్‌లో లేని వాహనాలను రోడ్లపైకి తీసుకురావద్దని సూచించారు. వాహనాలను నిర్ధారిత స్థలాల్లోనే పార్క్ చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చ ని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంవీఐలు రాజమల్లు, సంజ య్, రాజశేఖర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.