9 April, 2026 | 2:42 AM

ఆదిత్య విద్యాసంస్థలకు అనుమతుల్లేవు!

09-04-2026 12:00 AM

విద్యార్థులు చేరొద్దు: ఉన్నత విద్యామండలి 

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఆదిత్య విద్యాసంస్థల పేర్లతో అడ్మిషన్లు చేపడుతున్న డిగ్రీ కళాశాలలు, బిజినెస్ స్కూల్స్‌కు ఉన్నత విద్యామండలి, సంబంధిత విశ్వవిద్యాలయం నుంచి ఎలాంటి అనుమతుల్లేవని ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఈ విద్యాసంస్థల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించింది. ఈ మేరకు బుధవారం ఉన్నత విద్యామండలి ప్రకటనను విడుదల చేసింది. ఈ విద్యాసంస్థలు ఫ్యాకల్టీలను రిక్రూట్‌చేసుకుని, విద్యార్థుల నుంచి 2026 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమకు ఫిర్యాదులందాయని తెలిపింది.