04-07-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల: జూన్ 3 (విజయక్రాంతి) జిల్లా లోని రుద్రంగి మండల కేంద్రంలోని మహలక్ష్మీ వైన్స్ దుకాణంలో బీరు సీసాల్లో పలుమార్లు వ్యర్థ పదర్థాలు దర్శనం ఇవ్వడంతో ఇదేంది అని ప్రశ్నించగా బీరుకు బదులు బీరు ఇస్తామని వైన్స్ దుకాణం సిబ్బంది చెప్పినట్లు పలువురు అంటున్నారు. తాజాగా ఓ యువకుడు బీరు కొనుగోలు చేసి చూడగా అందులో వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వ్యర్ధం అగుపడంతో ఆ యువకుడు కంగుతిన్నాడు.
ఇదేంటని సిబ్బందని నిలదీయగా మాకు సంబందం లేదు నీవు ఎక్కడైన చెప్పుకో అని దురుసుగా ప్రవర్తించినట్టు ఆ యువకుడు తెలిపాడు. ఆ బీరు బాటిల్ ఇస్తే మరొకటి ఇస్తానని సిబ్బంది చెప్పడంతో.. ఇలా ఎంత మందిని మోసం చేస్తారని యువకుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ప్లాస్టిక్ వ్యర్థాలను గమనించకుండా బీరును తాగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి మహాలక్ష్మీ వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురుకోరుతున్నారు.