04-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు త్వరలో సరికొత్త బాలామృతం అంజేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. నిపుణుల సిఫార్సు మేరకు పంచదార లేకుండా సరికొత్త బాలామృతంను టీజీ ఫుడ్స్ సిద్ధం చేయగా మంత్రి సీతక్క రుచి చూసి పలు సూచనలు చేశారు. పిల్లలకు తీపి అనుభూతి కలిగించేలా ఖర్జూరా పౌడర్‌ను మిక్స్ చేయాలని సూచించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క గురువారం సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్ వాడీల్లో చిన్నారుల్లో పోషకాహరాన్ని మెరు గు పరిచేందుకు మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చాలని సూచించారు.
నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. వీలనైంత త్వరగా అంగన్వాడీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ అం గన్వాడీ, కంటెయినర్ అంగన్వాడీలను ఏర్పా టు చేయాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకునేందుకు అన్‌లైన్ పో ర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, మహిళా శిశు స ంక్షేమ శాఖ డైరెక్టర్ సృజన, తెలంగాణ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు ఆర్డీసీ ద్వారా కోటి ఆదాయం
ఆర్టీసీ అద్దె బస్సుల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు రూ. కోటి అర్జించాయి. ఇప్పటివరకు 150 బస్సులను అర్టీసీకి మహిళా సంఘాలు అద్దె ప్రాతిపదికన అప్పగించాయి. ఒక్కో బస్సుకు ఆర్టీసీ నెలకు రూ.70వేలు చెల్లిస్తోంది. దీనికి స ంబంధించి మొదటి నెల పేమెంట్ చెక్కును ఆర్టీసీ యాజమాన్యం నుంచి సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ అందుకున్నారు. ఈ సందర్భంగా దివ్యా దేవరాజన్, సెర్ప్ సిబ్బంది మంత్రి సీతక్కతో భేటీ అయి మిఠాయిలు తినిపించారు. వారిని సీతక్క అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు.