calender_icon.png 4 July, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిఓ నెంబర్ 49ను రద్దు చేయాలంటూ తహసీల్దార్ కు వినతి

03-07-2025 11:31:55 PM

ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం మానుకోవాలి..

తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం.. 

వాజేడు (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అడవులను అటవీ జంతువుల పరిరక్షణ పేరుతో, అడవులను ప్రైవేటీకరించే ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలోని తడోబా-అందారి పులుల ఉత్పత్తి కేంద్రం, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్(Kawal Tiger Zone)లను అనుసంధానం చేస్తూ "కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్" చేస్తూ జీవో నెంబర్ 49ని రాష్ట్ర ప్రభుత్వం మే 30వ తేదీన తీసుకొచ్చిందని, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జెజ్జరీ దామోదర్ తెలిపారు.

ఈ కన్సర్వేషన్ రిజర్వులో దాదాపు 3 లక్షల 74 వేల ఎకరాలను అడవిని రిజర్వ్ చేసింది. దీని వలన ఆదివాసీలు, ఇతర పేదలు చేస్తున్న పొడు వ్యవసాయ భూములను, 339 ఆదివాసి గ్రామాలను ఖాళీ చేయించి, వారిని అడవుల నుండి గెంటివేసే లక్ష్యంతో కుట్ర పూరీతంగా జిఓ తీసుకొచ్చారని అన్నారు. కావున వెంటనే జీవో నెంబర్ 49 రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ వాజేడు మండలం తహసీల్దార్ శ్రీరాముల శ్రీనివాస్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు కారం నాగేశ్వరావు, కోరం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.