calender_icon.png 19 January, 2026 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంటినెంటల్ హాస్పిటల్స్ ఘనత

19-01-2026 01:05:32 AM

చారిత్రాత్మక ఇండో అమెరికా వైద్య సమావేశానికి ఆతిథ్యం

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): హైదరాబాద్ మరోసారి అంతర్జాతీ య వైద్య సహకారానికి కేంద్రబిందువుగా నిలిచింది. కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చారిత్రాత్మక ఇండోఅ మెరికా ఆరోగ్య సమావేశం, భారత్‌ అమెరికా మధ్య వైద్య రంగ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక వేదికగా మారింది. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) అధ్యక్షుడు డా.బాబీ ముక్కమాల నాయకత్వంలో, ఏఎంఏ పూర్తి నాయకత్వ బృందం ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా డా. బాబీ ముక్కమాలకు ఘనంగా సన్మానం నిర్వహించారు. 180 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏఎంఏకు తొలి ఆసియన్‌అమెరికన్ అధ్యక్షుడిగా, అలా గే భారతీయ మూలాల నుంచి వచ్చిన తొలి అధ్యక్షుడిగా ఆయన అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హైదరాబాద్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 300కిపైగా ప్ర ముఖ వైద్య నాయకులు, వైద్య సంస్థల ప్రతినిధులు, ఆరోగ్య రంగ నిపుణులు ఈ సమా వేశానికి హాజరయ్యారు.

ఇండోఅమెరికా వైద్య భాగస్వామ్యం, వైద్య విద్య, రోగి భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, గ్లోబల్ ప్రమాణాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. డా. బాబీ ముక్కమాల తన ప్రసంగంలో వైద్యుల శ్రేయస్సు, రోగి కేంద్రిత సేవలు, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ఏఎంఏ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సమావే శాన్ని ఆలోచించి కార్యరూపం దాల్చేలా చేసిన కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ డా.గురు ఎన్. రెడ్డి మాట్లాడుతూ, అమెరికా ఆరోగ్య వ్యవస్థలో తనకు దశాబ్దాలుగా ఉన్న అనుభవాలను పంచుకున్నారు.

ఈ సమావేశంలో ఇండియన్ మెడిక ల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఏహెచ్‌పీఐ వంటి జాతీయ స్థాయి వైద్య సంస్థల ప్రతినిధులు ప్రసంగిస్తూ, అక్రెడిటేషన్ ప్రమాణా లు, నాణ్యత నియంత్రణ, రోగి భద్రతా విధానాల ప్రాధాన్యతను వివరించారు. వైద్య విద్య, పరిశోధన, డిజిటల్ హెల్త్, టెలీమెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధు నిక సాంకేతికతల పాత్రపై కూడా లోతైన చర్చ జరిగింది. గ్రామీణ, వెనుకబడిన ప్రాం తాలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అం దించడంలో గ్లోబల్ సహకారం కీలకమని పలువురు నిపుణులు పేర్కొన్నారు. యువ వైద్యులకు నాయకత్వ లక్షణాలు పెంపొందించే శిక్షణా కార్యక్రమాలు, అంతర్జాతీయ ఫెలోషిప్లు, అకడమిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లు అవసరమని ఈ సమావేశం నొక్కి చెప్పింది.