19-01-2026 01:04:55 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (విజయక్రాంతి): సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి పండుగ వేళల్లో ప్రజల ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో విరుచుకుపడుతు న్నారు. పండుగ కానుకల పేరుతో వాట్సాప్ లో వచ్చే లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలను ఎక్స్ వేదికగా హెచ్చరించా రు.
‘ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో ఫోన్ పే రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్.. సంక్రాంతి కానుక.. అంటూ కొన్ని లింకులు విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇది అమాయకులను బుట్ట లో వేయడానికి కేటుగాళ్లు వాడే ఒక సైకలాజికల్ ట్రిక్ అని, ఇలాంటి ఉచిత కానుకలను నమ్మి మోసపోవద్దని సీపీ స్పష్టం చేశారు. ఆశపడి ఆ లింక్ ఓపెన్ చేస్తే.. క్షణాల్లో మీ ఫోన్లోకి ప్రమాదకరమైన మాల్వేర్ ,వైరస్ ప్రవేశిస్తుందని హెచ్చరించారు.