calender_icon.png 19 January, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నృపతుంగ కాలేజీలో వైద్య శిబిరం

19-01-2026 01:07:23 AM

మార్వాడీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ

హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): హైదరాబాద్ మా ర్వాడీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ సహకారంతో కాచిగూడలోని నృపతుంగ కాలేజీలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషి యన్, కార్డియాలజిస్ట్, ఈఎన్టీ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, ఆంకాలజిస్ట్, న్యూ రాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఆఫ్తల్మాలజిస్ట్, డెంటిస్ట్ విభాగాలకు చెందిన వైద్యులు ప్రజలకు ఉచితంగా వైద్య సలహాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హైదరాబాద్‌సికింద్రాబాద్ మార్వాడీ మహిళా సంఘం ప్రతిని ధులు, మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందానికి, సహకరించిన సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో డా.ప్రమోద్ కు మార్, డా. రవి శంకర్, డా. సంతోష్ నారాయణకర్, డా. రఘువీర్, డా. సృజన, డా. డి. శ్రీనివాస్ రావు, డా. నేహా, డా.బి. నివేద్ రావు, డా. పృధ్వీ కృష్ణ, డా. ఉదయ్ కృష్ణ, డా. అమరేంద్ర కుమార్ సింగ్, డా.జితేందర్ రెడ్డి, డా.సాగర్ భుయ్యర్, డా.ఎస్. రమేష్, డా.రాజేష్, డా.కృష్ణ గోపాల్ బండారి, డా. సత్య ప్రకాష్,  మెడికల్ సూపరింటెండెంట్ ప్రశాంత్ రెడ్డి, సెంటర్ హెడ్ కృష్ణవేణి, సంఘం అధ్యక్షులు కలావతి జాజు, ప్రధాన కార్యదర్శి హేమలత శర్మ, కార్యక్రమ సలహాదారులు పుష్పా బూబ్, ఆరోగ్య కమిటీ కన్వీనర్‌ అల్కా చౌదరి పాల్గొన్నారు.