22 June, 2026 | 1:58 PM

Breaking News

ఈపీఎఫ్‌వో కొవిడ్ అడ్వాన్సులు నిలిపివేత

15-06-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 14: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తన సభ్యులకు ఇస్తున్న కొవిడ్ 19 అడ్వాన్సులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కొవిడ్ తొలివేవ్ సందర్భంగా ఈపీఎఫ్ సభ్యులకు సంస్థ నాన్ అడ్వాన్సుల్ని ఇచ్చింది. తదుపరి రెండోవేవ్ సమయంలో 2021 మే 31 నుంచి మరో అడ్వాన్సు తీసుకునేందుకు అనుమతించింది. కొవిడ్ పాండమిక్ లేనందున ఈ అడ్వాన్సుల్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ఈపీఎఫ్‌వో తాజా సర్యులర్‌లో వెల్లడించింది.