calender_icon.png 23 February, 2026 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతరం కృషి

23-02-2026 05:19:57 PM

మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పట్టణంలోని 17వ వార్డులో వాటర్ మోటర్ చెడిపోవడం వల్ల కాలనీవాసులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్  తన స్వంత నిధులతో నూతన వాటర్ మోటర్ ఏర్పాటు చేయడంతో కాలనీవాసుల నీటి సమస్య పరిష్కారమైంది.

ఈ సందర్భంగా ఎండీ అహ్మద్ మాట్లాడుతూ... ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని, 17 వార్డు అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపెడతానని తెలిపారు. వాటర్ మోటర్ ద్వారా దాదాపు 100 కుటుంబాల నీరు సరఫరా అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్య చెప్పిన వెంటనే పరిష్కరించిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ నిసార్, సయ్యద్ జావిద్, షబ్బీర్, కాలనీవాసులు హఫీజ్, మాజిద్, ఫైజాన్ , ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.