23-02-2026 05:23:49 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జరిగిన గొడవలో నమోదైన కేసులో హైకోర్టు నుండి బెయిల్ పొందిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఏడుగురు పట్టణ పోలీస్ స్టేషన్లో హైకోర్టు బెయిల్ కు సంబంధించి షూరిటీలు ఇవ్వడానికి ర్యాలీగా వచ్చారు. పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఉత్కంఠ వాతావరం నెలకొంది. అనుమతి ఉన్న వ్యక్తులకే పోలీసులు అనుమతించడంతో బెయిల్ మంజూరైన పైలెట్ తో పాటు మరో ఏడుగురు బీఆర్ఎస్ నేతలు పట్టణ సిఐ ముందు షూరిటీలు సమర్పించారు.