calender_icon.png 7 December, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదగాలంటే నిరంతర అభ్యాసం అవసరం

07-12-2025 12:00:00 AM

  1. క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిటీవో ముకేశ్ జైన్
  2. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి
  3. ఏఆర్సీఐ డైరెక్టర్ ఆర్ విజయ్

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలంటే నిరంతర అభ్యాసం అవసరమని క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సిటీవో-ముంబై ముకేశ్ జైన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘కెరీర్ క్లారిటీ ఇన్ టెక్‘ అనే అంశంపై శనివారం ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో ముకేశ్ జైన్ మాట్లాడుతూ.. టెక్ ప్రపంచం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుందని, ఈ రంగంలో విజయం సాధించాలంటే జిజ్ఞాసతో ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చు కోవాలని పేర్కొన్నారు. వైఫల్యాల నుండి నేర్చుకోవాలనే దృక్పథం ముఖ్యమని చెప్పా రు. ఇతరులతో కలిసి పనిచేయడం, అభిప్రాయాలను గౌరవించడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఉద్యోగ జీవితంలో చాలా అవసరమని వివరించారు.

టెక్నాలజీలో వేగంగా మారుతున్న ట్రెండ్లకు అనుగుణంగా తమను తాము ఎలా తీర్చిదిద్దుకో వాలో విద్యార్థులకు ఆయన సూచనలిచ్చారు. విద్యార్థులు తమ జీవితంలో ఎదుర య్యే సవాళ్లను సానుకూల దృక్పథంతో నూతన అవకాశాలుగా మార్చుకోవాలని హైదరబాద్లోని ఏఆర్సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్ విజయ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరిశోధన, ఇంజనీరింగ్ రంగాల్లో సవాళ్లు సహజమని, వాటిని చూసి భయపడకుండా, సమస్య పరిష్కారానికి తొలి అడుగుగా భావించాలని సూచించారు.

యువ ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు తమ చదువు పూర్తయినంత మాత్రాన నేర్చుకోవడం ఆపకూడదని, కొత్త టెక్నాలజీలను, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, తమను తాము అప్డేట్ చేసుకోవాలని వివరించారు.  కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు, ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.