calender_icon.png 7 December, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

07-12-2025 12:00:00 AM

  1. అయ్యప్ప స్వాములకు పూజా సామగ్రి పంపిణీ
  2. ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాం తత లభిస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ డివిజన్ వెజిటేబుల్ మార్కెట్ ఎదురుగా వినోద్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు అయ్యప్ప పడి పూజకు అవసరమయ్యే పూజా సామాగ్రిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో  బీఆర్‌ఎస్ రాష్ట్ర  యువ నాయకులు ముఠా జై సింహ, వివిధ డివిజన్ ల అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వై శ్రీనివాస్, వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శులు సురేందర్, ఆకుల అరుణ్ కుమార్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సుధాకర్ గుప్తా, శ్రీధర్ చారి, శివ ముదిరాజ్, ఆకారం శ్రీనివాస్, ప్రవీణ్ ముదిరాజ్, బల్వంత్ రాజు తదితరులు పాల్గొన్నారు.