28 March, 2026 | 2:33 AM

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నిరంతరం నిఘా

28-03-2026 12:00 AM

 జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

రాజన్న సిరిసిల్ల, మార్చి 27 (విజయక్రాంతి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టే దిశగా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టి నిఘాను కఠినతరం చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇసుక త్రవ్వకాలు, రవాణా చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మన ఇసుక వాహనం ద్వారా ఇసుక సరఫరా చేయాలని, అక్రమంగా ఇసుక రవాణా చేసిన ,నిల్వలు ఉంచిన వారిపైనా కేసులు నమోదు చేసి,సంబంధిత వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

గడిచిన మూడు నెలల వ్యవధిలో జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై వరుస దాడులు నిర్వహించి మొత్తం 45 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇకపై కూడా అక్రమ ఇసుక రవాణాపై ఎలాంటి సడలింపు లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీస్ స్టేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.ఇసుక అక్రమ రవాణా లేదా అక్రమ నిల్వలపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.