28 March, 2026 | 2:29 AM

వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు

28-03-2026 12:00 AM

కొత్తపల్లి, మార్చి 27 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం 26వ డివిజన్ ఆదర్శ్ నగర్ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి  అభయ ఆంజనేయస్వామి దేవస్థానం శివాలయంలో ప్రతి యేడు శ్రీరామ నవమి పర్వదినాన  శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో భాగంగా స్థానిక కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ శ్రీదేవి దంపతులు ఇంటి నుండి శ్రీరాములవారు  స్వామి వారి ఎదుర్కోలు కార్యక్రమాలు మొదలై దేవాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా స్థానిక కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ శ్రీరాముడు జన్మించిన ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడి ఆశీస్సులు మీ అందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆనందం, ఆయురారోగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, ధర్మం, నిజాయితీ, ప్రేమ వంటి విలువలను పాటిస్తూ మన డివిజన్ మన నగరము  మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాముని అన్నారు.ఈ కళ్యాణమహోత్సవంలో  దేవాలయ కమిటీ అధ్యక్షులు మెతుకు కనకయ్య, కార్యదర్శిలు భూమిరెడ్డి,ఓ మల్లయ్య, గంధo లక్ష్మీనారాయణ,పిట్టల కనకయ్య, జిల్లి సత్తయ్య, అశోక్ రెడ్డి, ఇట్టినేని శ్రీనివాస్, తోట సత్యనారాయణ,జైపాల్ రెడ్డి వంశీధర్ రెడ్డి , రమణారావు,రామ్మూర్తి, శ్రీనివాస్ రావు, కోటేశ్వర్, వైద్యుల శ్రీధర్, ఈ రమేష్, గంధం శ్రీధర్,  మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.