నిరంతరం కార్మిక పక్షం సిఐటియు
మహబూబాబాద్, (విజయక్రాంతి): సిఐటియు(Centre of Indian Trade Unions)నిరంతరం కార్మికపక్షం వహిస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడుతోందని మహబూబాబాద్ పట్టణ కార్యదర్శి(Mahabubabad Town Secretary) కుమ్మరి కుంట్ల నాగన్న అన్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలు, గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల సిఐటియు పతాకాన్ని ఎగురవేసి కార్మికుల ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1970 మే 30న కార్మికుల సంక్షేమం కోసం, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల సాధన కోసం ఏర్పడ్డ సిఐటియు అప్పటి వరకు అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం(Central government) కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంతవరకు విశ్రమించేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో బత్తుల వెంకన్న, బానోత్ రవి, శ్రీను, హేమ, ప్రసాద్, రవి, వీరస్వామి, వెంకన్న, సేవ్య, నవీన్, రాజు, మురళి మోహన్ తదితరులు పాల్గొన్నారు.






