22 July, 2026 | 7:13 PM

Breaking News

వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •   ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచాలి   •   హుస్నాబాద్‌లో మూడు జిల్లాల అధికారులతో జరిగే ఎల్‌నినో సమీక్ష ఏర్పాట్ల పరిశీలన   •   గురుకులంలో గోరింటాకు సందడి   •  

తాత్కాలికంగా వాయిదా పడిన కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె

22-07-2026 06:37 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సి.హెచ్. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో యూనియన్, ఏజెన్సీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో పెండింగ్ వేతనాల చెల్లింపు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, యూనిఫాంలు, గుర్తింపు కార్డులు, నియామక పత్రాల జారీ తదితర డిమాండ్లపై అంగీకారం కుదరడంతో సమ్మెను వాయిదా వేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి సహకరించిన డాక్టర్ కిరణ్ కుమార్‌కు యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, బోగే ఉపేందర్, ప్రతినిధులు గంగాధర్, మమత, మాధవి, రాధ, అమృత, కాంట్రాక్టర్ సంపత్, ఏడీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.