22 July, 2026 | 7:22 PM

Breaking News

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన   •   సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి   •   ధర్మేంద్ర ప్రధాన్ కాదు... మోదీ రాజీనామా చేయాలి   •   వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •  

జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల

22-07-2026 06:51 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో జాతీయ పతాక ప్రాముఖ్యత, ఆవశ్యకత, గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ షేక్ యూసుఫ్, డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ లయన్ బట్టు మధు హాజరై మాట్లాడుతూ... ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం లభించిందని,అమరవీరుల త్యాగాలను ప్రతి తరం స్మరించుకుంటూ, జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. భారతదేశ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను  పరిరక్షిస్తూ దేశాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.