ప్రభుత్వ స్థలాలపై నిఘా ఉంచాలి
22-07-2026 06:47 PM
సిద్దిపేట కలెక్టరేట్: చిన్నకోడూర్ మండలంలోని పలు ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ కె.హైమావతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కిస్టాపూర్ గ్రామ శివారులో ఇల్లంతకుంట వెళ్లే రహదారి వెంట అనంతగిరి రిజర్వాయర్ సమీపంలోని 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. స్థలాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని, ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ తహసీల్దార్ సలీంను ఆదేశించారు. అనంతరం అల్లీపూర్ శివారులో అనంతగిరి రిజర్వాయర్ పక్కన ఉన్న నీటిపారుదల శాఖ స్థలాన్ని పరిశీలించారు.






