09-09-2025 12:40:25 AM
- క్యాన్సర్ వారితో పోరాడుతున్న దివ్య
- రోజురోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యం
- వైద్యం కోసం లక్షల అప్పులు
- దాతల కోసం మల్లేశం ఎదురుచూపు
ముస్తాబాద్,సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సుంచు దివ్య,మల్లేశం దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్న వీరిపై దేవుడు చిన్నచూపు చూపాడు. నిరుపేద కుటుంబం ఒక సమస్య అయితే దానికి తోడు దివ్య కు క్యాన్సర్ రావడంతో ఆ కుటుంబం కోలుకోలేని పరిస్థితి నెలకొంది.
గత నెల రోజుల నుండి హైదరాబాద్ లోని బసవ తారక హాస్పిటల్లో చేర్పించి అప్పులు చేసి లక్షలు ఖర్చు పెట్టిన దివ్య ఆరోగ్యం మెరుగు కాకపోవడం చేతిలో చిల్లి గవ్వలేక భార్య దివ్యను కాపాడుకోవాలని ఆమె భర్త మల్లేశం ఆవేదన చెందుతూ దాతల ఆర్థిక సహాయం కొరకు ఎదురుచూస్తున్నాడు. రేక్కాడితే గాని డొక్క నిండని బీద కుటుంబం వారిది మెరుగైన వైద్యం కొరకు లక్షల రూపాయలు అవసరమని బిక్కుబిక్కుమంటూ రోధిస్తున్న మల్లేశం కుటుంబానికి మనమంతా అండగా మనకు చేతనైన సహాయం అందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడడానికి దాతలు ఎవరికి తోచినంత ఆర్థిక సహాయాన్ని అందించి దివ్య ప్రాణాలు కాపాడుదామని కొల్లూరు శంకర్ తెలిపారు.దాతలు ఆర్థిక సహాయం పంపించాల్సిన గూగుల్ పే ఫోన్ పే నెంబర్ 9908931337. సుంచు మల్లేష్..కు సహాయం అందించగలరని కోరుతున్నాం.