మందుల ధరల నియంత్రణ ముఖ్యం
24-03-2026 12:39 AM
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల లోపల ఉండే ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలను నియంత్రించడం ఎంతో ముఖ్యమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది పేదవారే నన్నా రు. బయట ఆసుపత్రుల కంటే, జనరిక్ మం దుల కంటే ధరలు ఎక్కువగా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. వీటి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.




