ట్రాఫిక్ సిబ్బందికి చలువ అద్దాల పంపిణీ
22-04-2026 05:54 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వేసవికాలంలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని హనుమకొండ శరత్ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు చేతుల మీదుగా ట్రాఫిక్ సిబ్బందికి చలువ అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అదనపు డిసిపి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ట్రాఫిక్ సిబ్బంది విధి నిర్వహణలో ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతా రెడ్డి, ఎస్సై కొమురెల్లి,శరత్ కంటి హాస్పిటల్ ప్రతినిధులు పాల్గొన్నారు.






