22 April, 2026 | 6:58 PM

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

22-04-2026 05:57 PM

* సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ వెంకటయ్య

లింగాల: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే అంగన్వాడీల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ వెంకటయ్య అన్నారు. మంగళవారం లింగాలలో పోషణ పక్షంలో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మెరుగైన విద్యతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారన్ని అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు న్యూట్రీషన్ ఫూడ్ అందజెస్తారని, పోషకాహార లోపాన్ని నివారణే లక్ష్యంగా పనిచేస్తున్న అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సిడిపివో దమయంతి మాట్లాడుతూ... మాతా శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే పోషణ పక్షం లక్ష్యమని.. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు. సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతకు శ్రద్ద వహించాలన్నారు. కార్యక్రమంలో సిడిపివో దమయంతి, వార్డు సభ్యులు రాజు, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  ఇందిరా, ఐసిడియస్ సూపర్వైజర్ గిరిజ తదితరులు పాల్గొన్నారు.