20-12-2025 12:00:00 AM
సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట, డిసెంబర్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. శుక్రవారం సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ఇచ్చినా హామీలు అమలు చేస్తున్నారని అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీజేపీ ఒక్కటి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ని అడ్డుకోలేకపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆర్‌ఎస్ పార్టీ బిజెపి పార్టీ చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ను ఓడించాలని కుట్రలు పన్నిందని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి అంటే వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసేలా లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారని, పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం, ఉచితవిద్య, ఉచితంగా బస్సు, రైతు బంధు రుణమాఫి మొదలైన పథకాలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు, గాయాజుద్దీన్, హర్షద్ బాబా, విజయ్, డానియల్, నజ్జు తదితరులు పాల్గొన్నారు.