calender_icon.png 6 December, 2024 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూలనపడ్డ కొదుమూరు లిఫ్ట్

04-11-2024 12:08:34 AM

  1. రూ.30లక్షల కాపర్ తీగ చోరీ 
  2. ఆలస్యంగా గుర్తించిన అధికారులు 
  3. ప్రశ్నార్థకంగా మారిన ఆయకట్టు
  4. మరమ్మతు చేయాలంటున్న రైతులు 
  5. నిధుల కోసం అధికారుల ఎదురుచూపు

ఖమ్మం, నవంబర్ 3 (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యం, ఏమరుపాటు ఫలితం గా ఖమ్మం జిల్లా కొదుమూరు వందనం ఎత్తిపోతల పథకం మూలనపడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగలు పడ్డ ఆరునెలలకు.. అన్న చందంగా అధికారులు మేల్కొన్నారు.

కొద్ది నెలల క్రితం ఈ ఎత్తిపోతల పథకంలో దొంగలు పడి, లక్షల విలు వైన కాపర్ తీగలు, ఆయిల్‌ను చోరీ చేసిన ట్టు ఆలస్యంగా గుర్తించారు. నెలల కిందట దొంగతనం జరిగితే.. తాజాగా వెళ్లి చూసి దొంగలు పడ్డట్టు గుర్తించడం విమర్శలకు తావిస్తోంది.

దాదాపు రూ.30 లక్షల విలువై న కాపర్ తీగలను దొంగలు ఎత్తికెళ్లిన ఫలితంగా పథకం పని చేయకుండా మూలనప డింది. దీంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. ఎత్తిపోతల పథకానికి సంబంధించిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు సంబం ధించిన కాపర్ వైర్ దొంగలపాలైంది. అధికారులు ఆలస్యంగా గుర్తించడం వల్ల ఆయ కట్టుకు సాగునీరందక రైతులు ఇబ్బందిపడుతున్నారు. 

పెద్ద ఎత్తున కాపర్ తీగ చోరీ

జిల్లా వ్యాప్తంగా కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, కొణిజర్ల, నేలకొండపల్లి, కూసుమంచి, వేంసూరు తదితర ప్రాంతాల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ వైరు దొంగతనాలు జరిగాయి. ఖమ్మంలో కూడా ఇలాంటి చోరీలు చోటుచేసుకున్నాయి. చివరికి ఎత్తిపోతల పథకాన్ని కూడా దొంగలు వదిలిపెట్టలేదు.

దొంగలను పట్టుకోకపోవడంతో వారు విజృంభించి, రైతులకు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్ చోరీలకు పాల్పడు తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూలనపడిన ఈ ఎత్తిపోతల పథకాన్ని  మరమ్మతు చేయాలంటే కొన్ని నెలలు పడుతుందని తెలియడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

రిపేరు చేయాలంటే ఎంత లేదన్నా రూ.60 లక్షల దాకా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికిన నిధులు మంజూరు చేస్తే నే దీనికి మరమ్మతు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, మరమ్మతుకు చర్యలు తీసుకుని, పథకాన్ని పున రుద్దరించాలని రైతులు కోరుతున్నారు. పోలీసులు, ఇరిగేషన్ అధికారులు జోక్యం చేసు కుని, దొంగలను పట్టుకుని, రైతులకు న్యా యం చేయాలని రైతులు కోరుతున్నారు. 

పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకి

వీ వెంకటాయపాలెం సమీపంలోని సాగర్ కాల్వపై రూ.28.85 కోట్లతో ఈ లిఫ్ట్‌ను గతంలో నిర్మించారు. చింతకాని మండలంలోని చింతకాని, వందనం, కొదుమూరు, అల్లీపురంతోపాటు రాఘవాపురం తదితర గ్రామాలకు సాగునీ టిని అందించే లక్ష్యంతో దీనిని ఏర్పాటుచేశారు.

దీని కింద దాదాపు 2,500 ఎకరాల ఆయకట్టు ఉంది. 2017 జనవరిలో దీనిని ప్రారంభించారు. నవంబర్ ఒకటి నుంచి  ఏప్రిల్ వరకు ౬ నెలల పాటు దీని ద్వారా ఆయకట్టుకు సాగునీటిని అందిస్తారు. గత ఏప్రిల్‌లో దీనిని మూత వేశారు. కానీ, ఆ తర్వాత దీని గురించి పట్టించుకోలేదు.

తాజాగా ఆయకట్టుకు సాగు నీటిని అందించాలనే ఉద్దేశంతో అధికారులు ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్ళి చూడగా దొంగలు పడి, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి లక్షలాది రూపాయల విలువైన కాపర్ వైరుతోపాటు ఆయిల్‌ను ఎత్తికెళ్ళినట్లు గుర్తించారు. పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.