calender_icon.png 9 January, 2026 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్, మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి

05-01-2026 12:47:48 AM

  1. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టీ. జ్యోతి

పెన్షన్ పెంచకుండా వికలాంగులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య

ముషీరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలని సీపీఎం కేంద్ర కమిటీ టి. జ్యోతి అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విబి జీ రామ్ జీ బిల్లు రద్దయ్యే వరకు పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సభవికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అంధు ల అక్షర ప్రధాత లూయిస్ బ్రెయిలి 217 వ జయంతి సందర్బంగా ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కేంద్ర ప్రభుత్వ విధానాలు- వికలాంగులపై ప్రభావం‘ అనే అంశంపై సెమినార్ రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్ అధ్యక్షతన జరిగింది.

ముందుగా లూయిస్ బ్రేయిలి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు టి. జ్యోతి హాజరై మాట్లాడుతూ పెట్టుబడి దారుల కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగంగా అమలు చేస్తుందన్నారు. 2019లో తీసుకువచ్చిన లేబర్ కొడ్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుందని తెలిపారు.

శ్రమ శక్తి నీతి 2025 పేరుతో కార్మికుల ప్రయోజనాలను పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు జెర్కొని రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు భుజంగారెడ్డి, చంద్రమోహన్, సుల్తాన్ రమేష్, పి శశికల, షైన్ బేగం, మల్లేష్,రాష్ట్ర నాయకులు లక్ష్మి పతి ఉషా, రాజు, నర్సింగ్, దీపిక, సుల్తానా, శివ, తదితరులు పాల్గొన్నారు.