calender_icon.png 8 January, 2026 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్పలో సండే సందడి

05-01-2026 12:47:30 AM

భక్తులతో కిటకిటలాడిన ఆలయం

వెంకటాపూర్, జనవరి4, (విజయక్రాంతి): ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయానికి ఆదివారం భక్తులు, పర్యాటకులతో కిటకిటలాడింది. సమీపిస్తున్న మేడారం జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారంతపు సెలవు కావడంతో కుటుంబ సమేతంగా వచ్చిన సందర్శకులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ శిల్పకళ, కాకతీయుల కాలానికి చెందిన నిర్మాణ వైశిష్ట్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.

విద్యార్థులు చరిత్ర, వాస్తు విశేషాలను తెలుసుకుంటూ టూరిజం గైడ్ విజయ్ ద్వారా సమాచారం సేకరించారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధ వాతావరణం నెలకొంది. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ సిబ్బంది, సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేపట్టి క్రమబద్ధంగా దర్శనాలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం రోజంతా రామప్ప ప్రాంతం ఉత్సాహభరిత వాతావరణంతో కళకళలాడింది.