21-01-2026 12:00:00 AM
సీపీఐ జాతీయ సెమినార్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
ఖమ్మం, జనవరి 20 (విజయ క్రాంతి): ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ శక్తులు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల చేతిలో బంధీగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్క ఆరోపించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని లబ్ది పొం దేందుకు కార్పొరేట్, ఫాసిస్టు శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన తెలిపారు. మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన నేటి భారతదేశం వామపక్షాలు ఎదుర్కొంటున్న సవా ళ్లు అనే అంశంపై ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్స్లో జరిగిన సెమినార్లో భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని బిజెపి నేతృత్వంలోని మతతత్వ శక్తులు నిర్వీర్యం చేస్తున్నాయని ఆర్థిక సామాజిక అంశాలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆయన తెలిపారు. వందేళ్ల సిపిఐ చరిత్రలో ఎన్నో అటుపొట్లు ఉన్నాయని విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా వందేళ్ల సిపిఐ సిడిని భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.