25 June, 2026 | 4:13 PM

చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ముందడుగు

25-06-2026 02:58 PM

 పాఠశాలకు పెయింటింగ్. 

పాల్వంచ (విజయక్రాంతి): తాను చదువుకున్న పాఠశాలలో అహల్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో పాత పాల్వంచ 47వ డివిజన్ కార్పొరేటర్  గుర్రం వెంకటేశ్వర్లు (జివిఆర్)ముందడుగు వేశారు. తాను విద్యనభ్యసించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటిచెప్పారు. స్థానిక పెద్దల సహకారంతో పాఠశాల భవనానికి పెయింటింగ్ పనులను ప్రారంభించి, విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. తాను చదివిన పాఠశాలకు తిరిగి సేవ చేయడం ప్రతి విద్యార్థి బాధ్యత  అనే భావనతో ముందుకు సాగుతున్నరూ గుర్రం వెంకటేశ్వర్లు  ఈ కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంటోంది.

పాఠశాల సౌందర్యవంతంగా మారడంతో పాటు విద్యార్థుల్లో విద్యాపట్ల మరింత ఆసక్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంద. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. పద్మలత , ఉపాధ్యాయులు, 47వ డివిజన్ కార్యదర్శి బర్ల వెంకటరత్నం, సహాయ కార్యదర్శి అహ్మద్ జానీ, మేడిద రూపస్, సెనగ శీను, అల్లి ప్రేమ్, భరద్వాజ్, వల్లమల్ల సందీప్, షరీఫ్, సీపీఐ పార్టీ యువ నాయకులు అష్రాఫ్, జానీ, ఎజాజ్, 46వ డివిజన్ సీపీఐ పార్టీ ఇన్‌చార్జి డా. మస్తాన్ గారు తదితరులు పాల్గొన్నారు...