31 March, 2026 | 7:12 PM

ఆర్ఓ కేంద్రాలను తనిఖీ చేసిన వ్యయ పరిశీలకులు

29-11-2025 07:13 PM

కోనరావుపేట (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కోనరావుపేట మండలంలోని పలు ఆర్ఓ కేంద్రాలను ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. కోనరావుపేట మండలంలోని కొలనూరు, మల్కపేట, కోనరావుపేట ఆర్ఓ కేంద్రాలను తనిఖీ చేసి, ఆయా కేంద్రాల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, నోడల్ అధికారి భారతి, ఎంపీడీఓ స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.