గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
09-07-2026 05:37 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెనపల్లి రైతు వేదికలో జరిగిన ఖానాపూర్ ,కడం, పెంబి, దస్తురాబాద్, సర్పంచులు కార్యదర్శులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సర్పంచులు కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, సెక్రికేషన్ షెడ్ల నిర్వహణ, పరిశుభ్రత ప్రణాళిక ప్రకారం చెత్తను వేరుచేసి నాణ్యమైన కంపోస్ట్ తయారు చేయాలని, గ్రామ పంచాయతీల నిధులను జిపిడిపి ప్లాన్ లో పొందుపరిచి ఖర్చు చేయాలని సూచించారు .కార్యక్రమంలో ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.






