10 June, 2026 | 3:57 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

అతివృష్టితో పత్తి రైతుల చిత్తు

06-10-2025 12:00 AM

వలిగొండ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): వలిగొండ మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అతివృష్టి వాతావరణం నెలకొని పత్తి రైతులు చిత్తయ్యారు. పత్తి సాగు రైతులు విత్తనాలు విత్తినప్పుడు వర్షాలు లేక ఇబ్బంది పడగా అనంతరం కురిసిన వర్షాలతో రైతులలో ఆనందం వెల్లువిరిసింది.

అయితే వర్షాలు తిరిగి అదే పనిగా కురియడంతో పత్తి పంటలు భూమి అరకపోవడంతో, జాలువారి పత్తి మొక్కలకు వేరుకుళ్ళు వ్యాపించడం పూలు సరిగా పోయాకపోవడం, పత్తి కాయలు కుళ్ళిపోవడం వంటివి జరగడంతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీంతో రైతులు తాము పత్తి పంట సాగుతో తీవ్రంగా నష్టపోయామని పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.