06-10-2025 12:00:00 AM
తుంగతుర్తి, అక్టోబర్ 5: మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అస్థికలను వాడపల్లి లోని కృష్ణ,తుంగభద్ర, మూసి సంగమం నదిలో కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఆదివారం నిమజ్జనం చేశారు. వాడపల్లి లో మొదట రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాటు కుటుంబ సభ్యులు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా కృష్ణానదిలో నిమజ్జనం చేశారు.
కార్యక్రమంలో దామోదర్ రెడ్డి సోదరులు గోపాల్ రెడ్డి , క్రిష్ణా రెడ్డి , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ , మేనల్లుడు జెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి , పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, తదితరులు అర్చకులు శ్రీరామ కవచం నాగయ్య శాస్త్రీ, కాశీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.