12-11-2025 01:15:02 AM
ఇబ్రహీంపట్నం, నవంబర్ 11: పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలనీ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ అన్నారు. రైతులు సి.సి.ఐ వారి పత్తి కొనుగోలు కేంద్రములో అమ్ముకొనుటకు గాను కపాస్ కిసాన్ యాప్ ద్వార స్లాట్ ను బుక్ చేసుకొని పత్తిని అమ్ముకోగలరని రైతులకు సూచించారు. స్లాట్ బుకింగ్ చేసుకొనుటలో ఏమైన ఇబ్బందులు ఏర్పడిన మార్కెట్ కమిటీలలో రంగారెడ్డి జిల్లాలో ఎర్పాటు చేసిన కపాస్ కిసాన్ సహాయ కేంద్రములలో సంప్రదించాలని తెలిపారు.
ఎకరానికి పంట దిగుబడి పత్తిని సి.సి.ఐ కొనుగోలు కేంద్రములలో అమ్ముకోవడానికి ఇతర జిల్లా రైతులు అనగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వికారాబాద్, నల్గొండ జిల్లా రైతులు తమ పత్తిని దగ్గరలో గల రంగారెడ్డి జిల్లా లో గల జిన్నింగ్ మిల్లులో అమ్ముకోవడానికి ప్రతిపాదనలు సి.సి.ఐ ఎండి. ముంబై వారికి పంపడడం జరిగిందని తెలిపారు. అదే విధముగా యాచారం మండల రైతులు మాల్, వెంకటేశ్వరనగర్, నల్గొండ జిల్లాలో అమ్ముకోవడానికి మ్యాపింగ్ చేయబడినది.
ఎన్డిఎస్ రైతులు తమ పత్తిని అమ్ముకోవడానికి కూడ వెసులుబాటును కల్పించడం జరిగినది. ఆన్లైన్ నమోదుచేసుకొని సంబంధిత జిన్నింగ్ మిల్లులలో అమ్ముకోవడానికి తమకు సంభందించిన వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి తమ పంట సాగు వివరములను నమోదుచేయించుకోగలరని రైతులకు సూచించారు.