12-11-2025 01:15:44 AM
ఎల్బీనగర్, నవంబర్ 11 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ స్వామి వివేకనంద పార్కు వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఇందిరమ్మ క్యాంటీన్ ను మంగళవారం కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... ఇందిరమ్మ క్యాంటీన్ లో లబ్ధిదారులకు సబ్సిడీతో ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు రూ.5 లకే అల్పాహారం,
మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 గంటల వరకు రూ.5 లకే భోజనం అందిస్తారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఒక్కో అల్పాహారంపై రూ.14, భోజనంపై రూ.24.83 ఖర్చు చేస్తుందని, వీటి నిర్వాహణ బాధ్యతను హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్ చూస్తుందని చెప్పారు. ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా ఉదయం అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో డివిజన్లోని పేదలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు,
అల్పదాయ వర్గాలు, నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ శానిటేషన్ డీఈ నీలిమ, ఎస్‌ఎస్ అజీమ్ ఉద్దీన్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, పవన్ రెడ్డి, నాయకులు సుధీర్ కుమార్, బీజేవైఎం అధ్యక్షుడు సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు.