calender_icon.png 12 November, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 వాహనం పరిశీలన

12-11-2025 01:13:51 AM

మేడ్చల్, నవంబర్ 11(విజయ క్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గుండ్ల పోచంపల్లి ప్రాంతంలో ఉంటున్న 108 వాహనాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పరిశీలించారు. అత్యవసర వైద్య పరికరాల పని తీరును తెలుసుకున్నారు. అంబులెన్స్ లో ఉన్న అత్యవసర ఔషాదాల వాడకాన్ని , అంబులెన్స్ లో ఉన్న  పరికరాల పనితీరును పరీక్షించి వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు సరైన సమయంలో చికిత్స అందించడం కోరకు ప్రభుత్వం, మరియు ఏమరి గ్రీన్ హెల్త్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో అన్నీ రకాల పరికరాలను సమకూర్చి పెట్టుకున్నారని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బృందం వారు తెలిపారు.  నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బృందం  అధికారి శివకుమార్  మేడ్చల్ జిల్లా 108 కోఆర్డినేటర్ తిరుపతి,గుండ్ల పోచంపల్లి 108 సిబ్బంది పాల్గొన్నారు.