calender_icon.png 13 November, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలి

13-11-2025 12:32:08 AM

కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట టౌన్, నవంబర్ 12: నారాయణ పేట జిల్లాలో ఈ నెల 12 నుంచి 19 వరకు నిర్వహించే వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  అదనపు కలెక్టర్ సంచిత్ గాoగ్వర్ తో కలిసి వయో వృద్ధుల వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 19 వరకు వారం రోజుల పాటు వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు.

జిల్లాలోని వయో వృద్ధులు వారోత్సవాలలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. డీ పీ ఆర్ వో రషీద్, డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శైలజ, ఎఫ్ ఆర్ ఓ సాయి, డీ సీ పీ వో కరిష్మా పాల్గొన్నారు.  కాగా వారోత్సవాలలో భాగంగా  ఈ నెల 12 న ప్రారంభోత్సవ వేడుక,

13 న వయో వృద్ధులకు ఆటల పోటీల వినోదాల కార్యక్రమాలు, 14న ఉచిత ఆరోగ్య శిబిరం, 15న వాకతాన్ సీనియర్ సిటిజన్ హక్కుల పై అవగాహన ర్యాలీ,  17న జిల్లా స్థాయి లో వృద్ధుల చట్టాలపై ఆరోగ్యం, చురుకైన వృద్ధాప్యం పై అవగాహన కార్యక్రమం, 18న గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల అవగాహన కార్యక్రమం, 19న జిల్లా స్థాయిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహణ తో వారోత్సవాలు ముగుస్తాయని ఎఫ్ ఆర్ ఓ సాయి తెలిపారు.