7 April, 2026 | 2:20 AM

భక్తి చాటిన కౌన్సిలర్ సౌజన్య దిలీప్ రెడ్డి

07-04-2026 12:17 AM

పెబ్బేరు ఏప్రిల్ 6:మున్సిపల్ కేంద్రంలోని 12వ వార్డులో ఉన్న 200 ఏళ్లనాటి స్వయంభూ శ్రీ విట్ట హనుమాన్ దేవాల యం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. తాజాగా జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం 12వ వార్డ్ కౌన్సిలర్ సౌజన్య దిలీప్ రెడ్డి రూ.1,00,116/- విరాళంగా అందజేసి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ స్వయంభూ హనుమంతుడు భక్తులకు అత్యంత చేరువైన దైవంగా పేరుగాంచాడని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ భక్తులు మనసారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే గాఢ విశ్వాసం నెల కొంది.అలాగే అనేక మంది భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఈ ఆలయ మహిమను విశేషంగా వర్ణిస్తున్నారు. ఆలయ అర్చకులు నవీన్ శర్మ తెలిపారు.