మిత్రుని కుటుంబానికి ఆర్ధిక సహాయం
07-04-2026 12:19 AM
అయిజ ఏప్రిల్ 6అయిజ మండలంలోని చిన్నతాండ్ర పాడు గ్రామానికి చెందిన బోయ సత్యం ఇటీవల గుండెపోటుతో మృ తి చెందారు. కాగా మృతుని కుటుంబానికి జిల్లా మెకానిక్ సంఘం తరపున జిల్లా అధ్యక్షులు గడ్డమిది నాగిరెడ్డి చేతుల మీదుగా రూ 30 వేల ఆర్ధిక సహాయం అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోయ స త్యం మృతి అందరికి తీరని లోటన్నారు.
జి ల్లాలో మెకానిక్ ఎవరు అకాల మరణం చెందిన అసోసియేసన్ తరపున మాకు చేతనైనా సహాయం అందచేస్తున్నామని , ఈ ఆర్ధిక సహాయం అందజేసిన మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ రాజేందరెడ్డి, మరియు సుభాన్, గుంతల రమేష్, ఇక్బాల్, మధు, షబ్బీర్, హరీష్ మొదలగువారు పాల్గొన్నారు.




