calender_icon.png 19 January, 2026 | 10:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు

19-01-2026 12:39:59 AM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఆదిలాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా తన వంతుగా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టం చేశారు. నేరడిగొండ మండలం గౌలిగూడ గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆదివారం ఎమ్మెల్యే  గ్రామా న్ని సందర్శించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గౌలిగూడలో గుడిసెలు లేకుండా అందరికి పక్క ఇండ్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుంటానన్నారు. గ్రామానికి మొట్టమొదటి సారిగా రూ. 1 కోటి 50 లక్షలతో  బీటీ రోడ్డు మంజూరు చేయించానని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు  పాల్గొన్నారు.