calender_icon.png 29 July, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి పరామర్శ

29-07-2025 12:36:32 AM

కామారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి):  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం లో ఇటీవల అనారోగ్యంతో టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తోట బుగ్గారాములు  మృతి చెందారు, వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సోమవారం పరామర్శించారు. గతం లో మాచారెడ్డి మాజీ వైస్, ఎంపీపీ గా బుగ్గ రాములు కొనసాగారు, ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. 

మృతుని పెద్ద కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుంటే ఆరోగ్య విషయం  పట్ల వారికి భరోసా కల్పించారు. రామారెడ్డి మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి,జనరల్ సెక్రెటరీ బుచ్చిరెడ్డి, మండల రైతు బంధు కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి , ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు గరుగుల రాజా గౌడ్, స్థానిక మాజీ ఎంపీటీసీ గజ్జెల రాజేందర్,టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు  ప్రభాకర్ రావు, తుపాకుల రాజేందర్ గౌడ్, సాయి రెడ్డి, లింభాగౌడ్,మద్దికుంట టిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.