29-07-2025 12:39:41 AM
నరకయాతన పడుతున్న ప్రజలు
కరీంనగర్, జూలై 28 (విజయ క్రాంతి): కరీంనగర్ నుంచి చొప్పదండి వెళ్లే రహదారిలో రైల్వే గేట్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబి) పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా ఈ బ్రిడ్జినిర్మాణ పనులు సాగుతుండగా వాహనదారులు,ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు. పనుల నిర్వహణలో తీవ్ర అలసత్వం, ట్రాఫిక్ నియంత్రణకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో వాహనదారులు గంటల తరబ డి ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారు.
గతంలో కూడా ఈ మార్గంలో రైలు గేటు పడితే గం టల తరబడి ప్రయాణికులు, వాహనదారు లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ము ఖ్యంగా ఈ మార్గంలో రాయపట్నం రహదారి ఉండగా చొప్పదండితోపాటు ధర్మా రం, వెల్గటూరు మీదుగా మంచిర్యాల జిల్లా కు చాలామంది వెళ్తుంటారు. అలాగే ధర్మపురి లక్ష్మీనరసింహ ఆలయానికి, కోటిలిం గాలకు చాలామంది పుణ్యస్నానాలకు వెళ్తుంటారు.
అయితే ఇక్కడ ప్రయాణికులు, వాహ నదారులు ఇబ్బందులు తొలగించేందుకు ఆర్వోబీ నిర్మాణ పనులను మొదలు పెట్టా రు. కానీ పనులు నత్తనడకన మూడు సంవత్సరాలుగా సాగుతుండడంతో ట్రాఫిక్ జాం అవుతున్నది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు గంటల కొద్ది వేచి ఉండాల్ని పరి స్థితి ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు దెబ్బతిన్నది. రహదారిలో పెద్ద పెద్ద గుంటలు ఏర్పడడంతో వాహనదారులకు ప్రయాణం భారంగా మారింది.
ద్వి చక్రవాహనదారులు గుంతల్లో పడిపోతూ గాయాలపాలువుతుండగా, కార్లు, ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. పాదచారులు మురికినీటిలో నడవాల్సి వస్తుండడం తో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ని ర్మాణ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పనులు వేగంగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని స్థానికులు డిమాండ్ చే స్తున్నారు. ఆర్ ఓ బి బాధితుల సంఘం ఏర్పాటు చేసి ఆందోళన ఉదృతం చేశారు.
సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమించాలి...
ఆర్వోబీ పనుల ఆలస్యంపై ఆర్వోబి బ్రిడ్జి పిల్లర్స్ కింద టెంట్లు వేసి ఒక బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి అంద రం కలిసి ఉద్యమించాలి. ప్రజలు ఇ బ్బందులు పడే పరిస్థితిని కలిగించడం సరికాదు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ పై ఒత్తి డి పెంచి మూడు నెలల్లో పని పూర్తిచేయించే కార్యాచరణ రూపొందించాలి.
వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇంచార్జి
నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
వర్షాలకు రోడ్డు దెబ్బతిన్నది. రహదారిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలకు గురవుతూ గా యాలపాలవుతున్నారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పనులు వే గంగా పూర్తి చేయాలి. వర్షాకాలంలో పరిస్థితి మరింత భయానకంగా మారేఅవకాశంఉంది.
గజ్జెల లక్ష్మణ్, ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షులు