4 April, 2026 | 2:11 PM

Breaking News

యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •  

రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

17-06-2025 12:38 AM

యాదాద్రి భువనగిరి జూన్ 16 ( విజయ క్రాంతి ): తమ ప్రేమను పెద్దలు ఎక్కడ కాదంటారని అనుమానంతో ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది.సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి జనగాం జిల్లా స్టేషన్ ఘనపురం మండలం నెమిలి కొండ గ్రామానికి చెందిన మచ్చ శృతి (23), కే వినయ్ కుమార్ లు (25) గత కొంతకాలంగా గాఢంగా  ప్రేమించుకుంటున్నారు.

ఒకరికొకరు ఇష్టపడడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్యకాలంలో వీరి ప్రేమ విషయం ఇరువురి పెద్దలకు  తెలిసింది. ఇక తమ ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించరని భావించి అనుమానించారు. ఈ నేపథ్యంలో ఇంటి నుండి పారిపోవడమే సరైనదని ఆదివారం రాత్రి ఆ ప్రేమ జంట ఇంటి నుండి బయలుదేరి యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకున్నారు. బతికుండి కలిసి జీవించలేము.

కలిసి అయిన చనిపోదామని నిర్ణయించుకున్న ఆ ప్రేమికులు తెల్లవారుజామున భువనగిరి పట్టణ శివారులో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం వారి శవాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకై భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.