1 April, 2026 | 9:01 AM

దంపతుల ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణం

18-02-2025 07:05 PM

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా(Vikarabad District)లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. దౌల్తాబాద్(Doultabad ) మండలంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరేసుకుని దంపతులు ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబకలహాలతో బలవన్మరణానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. మృతులను మహమ్మద్, హసీనాగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు(Police) కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.దంపతులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.