22 March, 2026 | 4:49 PM

కోర్టు రూమ్ డ్రామా వంచన

28-10-2024 12:00 AM

ఉమామహేశ్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వంచన’. చండీ దుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గౌరీ మార్పు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూర్య, రాజేంద్ర, ఆర్‌కే నాయుడు, సోనీరెడ్డి ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 8న సినిమాను విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు ఉమా మహేశ్ మార్పు మాట్లాడుతూ “వంచన ఒక కోర్టు రూమ్ ఎమోషనల్ డ్రామా. అరకు గ్రామంలో ఒక క్రిస్టియన్ ఫాదర్‌ని అతి కిరాతకంగా హత్య చేస్తారు. హత్య ఎవరు, ఎందుకు చేస్తారో తెలిపే కథే మా సినిమా” అని తెలిపారు. ఈ చిత్రానికి గీత సాహిత్యం: వరదరాజ్ చిక్కబల్లపుర, అనిరుద్ శాండిల్య మారంరాజ్; ఎడిటర్: గురుమూర్తి హెగ్డే కాన్నిపల్, నవీన్ హెగ్డే; సినిమాటోగ్రఫీ: సతీశ్, భాస్కర్; సంగీతం: విజిత్ కృష్ణ.