22 March, 2026 | 1:44 PM

ప్రశాంత్ నీల్ కథలోకి అలా ఎంటర్ అయ్యా

28-10-2024 12:00 AM

శ్రీమురళి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘బఘీర’. దీనికి ప్రశాంత్ నీల్ కథ అందించడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. డాక్టర్ సూరి దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రుక్మిణి వసంత్, ప్రకాశ్‌రాజ్ అచ్యుత్ కుమార్, గరుడ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు డాక్టర్ సూరి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘-మురళి సినిమా చేద్దామనునుకున్న సమయంలో కథ కుదరలేదు. అప్పుడే ప్రశాంత్ నీల్ తన దగ్గరున్న కథ చెప్పారు. నేను రైటింగ్ టీమ్‌లో ఉన్నా కాబట్టి కథ డెవలప్ చేస్తూ వచ్చా.

మామూలు కుర్రాడు రియల్ లైఫ్‌లో సూపర్ హీరో అవ్వాలనుకుంటే ఎలా? అతనికి ఏవేవి వచ్చు? లక్ష్యం చేరాడా? అనేదే కథ. హీరోది రియల్ లైఫ్ క్యారెక్టరే. సూపర్ మ్యాన్ లాంటి పవర్స్ ఏమీ ఉండవు. భైర అంటేనే బ్లాక్ పాంథర్. భైర వచ్చేదే నైట్. నైట్‌లో యాక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల కేజీఎఫ్‌లా అనిపిస్తుంది కానీ, కేజీఎఫ్‌లా ఉండదు. తెలుగులో మంచి అవకాశం వస్తే చేస్తా’ అన్నారు.