ఫౌజా సైనికులకు అంకితం
కార్తీక్ దమ్ము, ఐశ్వర్య సింగ్, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫౌజా’. దర్శకుడు ప్రమోద్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అజిత్ దాల్మియా నిర్మాత. ఈ సినిమాకు యుగ్ భూషల్ సంగీత సారథ్యం వహిస్తుండగా, సంకేత్ సానే నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. శశాంక్ విరాగ్ సినిమాటోగ్రఫీగా పనిచేశారు.
ఇప్పటికే హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీని హైదరాబా ద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఏపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ దమ్ము మురళీమోహన్, హర్యాన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ డీ సురేశ్, కాంతి డీ సురేశ్ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో కార్తీక్ దమ్ము మాట్లాడుతూ.. ‘నేను హైదరా బాద్‌లో పుట్టాను. నా సినిమా కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. సినిమాకు భాషా సరిహద్దులు ఉండవు’ అన్నారు. “డబ్బులుంటే బ్రాండెండ్ బట్టల్ని మాత్రమే కొనగలం, కానీ ఇండియన్ ఆర్మీ యూనిఫాంని కొనలేం..
దాన్ని కష్టంతో, ఇష్టంతో సాధించుకోవాలి.. దేశభక్తి ఉంటేనే అది మన సొంతమవుతుంది. దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ‘ఫౌజా’ నచ్చుతుంది. భారతీయ సైనికులందరికీ మా ఈ సినిమా అంకితం” అని దర్శకుడు ప్రమోద్‌కుమార్ అన్నారు.




